20 ఏళ్లు అయినా వాటిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను.. నయనతార షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-07 10:07:14  IST  )

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)కు పరిచయం అక్కర్లేదు. తెలుగు,తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

20 ఏళ్లు అయినా వాటిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను.. నయనతార షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)కు పరిచయం అక్కర్లేదు. తెలుగు,తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో చిత్రాల్లో నటించిన నయన్ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా రాణిస్తోంది. ఇక విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న నయన్ ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్‌ చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఒకప్పటి జ్ఞాపకాలను పంచుకుంది. ‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు అయిపోయాయి. స్టార్ హీరోలతో నటించాను.

మొదట్లో నా సినిమాలు ఎంతగా సక్సెస్ అయ్యాయో అదే విధంగా నేను కొన్ని చిన్న పొరపాట్లు కూడా చేస్తూ వచ్చాను. అందులో నటన గురించి మెలుకువలు నేర్చుకోవడంలో చేసిన పొరపాట్లు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఓ సినిమా షూటింగ్‌లో మోహన్ లాల్ గారితో నటించినప్పుడు నా పాత్రకు ఎక్కువ డైలాగులు ఉండేవి. అయితే వాటిని నేనే నేర్చుకుంటూ ఉండకపోతే.. మోహన్ లాల్ ఇంకా బాగా హావభావాలు పలకాలి అని నాకు పదే పదే చెప్తూ వచ్చాడు. ఇంటికి వెళ్లి రాత్రి కూడా రిహార్సల్స్ చేస్తూ వచ్చాను. అలా కష్టపడ్డాను. దానికి తగ్గ ఫలితం దక్కింది. సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది’’ అని చెప్పుకొచ్చింది.

కాగా.. నయన్ ప్రజెంట్ తెలుగులో మెగాస్టార్ సరసన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కెథరిన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీలో నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా భారీ వ్యూస్ రాబడుతూ యూట్యూబ్‌లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

READ MORE ....

64 ఏళ్ల తెలుగు హీరోతో న‌య‌న‌తార కొత్త సినిమా ?

Next Story