వైట్ అండ్ బ్లాక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ అందాలతో రెచ్చిపోయిన నయన్

by Pulgam srinivas |

వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చిన నయన్.

వైట్ అండ్ బ్లాక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ అందాలతో రెచ్చిపోయిన నయన్
X

దిశ, వెబ్ డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




ఇప్పటికీ కూడా నయన్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తిరుగులేని నటిగా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. వయసు పెరిగినా నయనతార అందంలో మాత్రం ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు.




కుర్ర హీరోయిన్లకు పోటీగా గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే ఈమెకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కుతున్నాయి.




సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.




వాటిలో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించింది. హెయిర్‌ను అందంగా ముడివేసుకొని ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ఫోటోలలో నయన్ స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story