Nayan Sarika : సిగరెట్ మందు గురించి ఓపెన్ అయిన బ్యూటీ.. కానీ అక్కడే ట్విస్ట్

by Pulgam srinivas |

Nayan Sarika : తాజాగా ఈనటి మాట్లాడుతూ... నేను కాల్చిన సిగరెట్ మరియు తాగిన మందు రెండు ఒరిజినల్ కాదని సమాధానం ఇచ్చింది.

Nayan Sarika : సిగరెట్ మందు గురించి ఓపెన్ అయిన బ్యూటీ.. కానీ అక్కడే ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : వరుస సినిమాలతో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్పీడులో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలలో నయన్ సారిక ఒకరు. తాజాగా ఈమె శ్రీ విష్ణు హీరోగా రూపొందిన విష్ణు విన్యాసం చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన విడుదలైంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈమెకు 'మీరు సిగరెట్ బాగానే కాల్చారు, మందు కూడా బాగానే తాగారు, అదంతా నిజమేనా?' అనే ప్రశ్న ఎదురయింది.

దానికి ఈ బ్యూటీ సమాధానం చెబుతూ... "నేను కాల్చిన సిగరెట్ మరియు తాగిన మందు రెండు ఒరిజినల్ కాదు. మందు తాగే సీన్లో నాకు నీళ్లు ఇచ్చారు. నేను నీళ్లు తాగి మందు తాగినట్లుగా నటించాను. ఇక సిగరెట్ కూడా డమ్మీనే. ఆ రెండింటిలో ఏదీ కూడా ఒరిజినల్ కాదు" అని ఈ బ్యూటీ సమాధానం ఇచ్చింది. నయన్ నటిస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఉండడం, అందులో ఈ బ్యూటీ తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వెళ్లడంతో మంచి అవకాశాలు ఈమెకు దక్కుతున్నాయి.

తాజాగా నయన్ నటించిన విష్ణు విన్యాసం సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి పర్వాలేదనే రేంజ్ కలెక్షన్లనే రాబట్టింది. టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబట్టి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మూవీలోని ఈ బ్యూటీ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Next Story