‘టాక్సిక్’ నుంచి నయన్ లుక్.. బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో పవర్ ఫుల్ అప్పియరెన్స్..

by Sujitha Rachapalli |

రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా లేడీస్ రోల్స్ ఇంట్రడ్యూజ్ చేస్తూ బజ్ పెంచేస్తోంది మూవీ యూనిట్. ఇప్పటికే కియారా, హ్యూమా ఖురేషి పాత్రలు రివీల్ కాగా తాజాగా నయన తార లుక్ రిలీజ్ చేశారు.

‘టాక్సిక్’ నుంచి నయన్ లుక్.. బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో పవర్ ఫుల్ అప్పియరెన్స్..
X

దిశ, సినిమా : రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా లేడీస్ రోల్స్ ఇంట్రడ్యూజ్ చేస్తూ బజ్ పెంచేస్తోంది మూవీ యూనిట్. ఇప్పటికే కియారా, హ్యూమా ఖురేషి పాత్రలు రివీల్ కాగా తాజాగా నయన తార లుక్ రిలీజ్ చేశారు. గంగగా తన పాత్రను ఇంట్రడ్యూజ్ చేస్తూ పవర్ ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. హై స్లిట్‌ కలిగిన బ్లాక్ గౌన్, థై-హై బూట్స్, గ్లోవ్స్, గోల్డ్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి, రివాల్వర్ చేతిలో పట్టుకుని నడుస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. వెనుక లగ్జరీ హాల్, ఆర్నమెంటెడ్ డబుల్ డోర్స్, చాండేలియర్స్, కాన్ఫెట్టి, యూనిఫాం డోర్‌మెన్‌లు, షాడోలో గన్‌లతో ఉన్న ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఇది హై-స్టేక్స్ యాక్షన్, పవర్‌ఫుల్ వైబ్ ఇస్తుండగా.. నయన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక మార్చి 19న రిలీజ్ కానున్న మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకులు కాగా కన్నడం, ఇంగ్లీష్‌లో సైమల్టేనియస్‌గా షూట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Link

Next Story