‘రాజు గారు వస్తున్నారంటే మోత మోగిపోవాల్సిందే’.. యంగ్ హీరో సినిమాపై హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-26 11:56:25  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) ‘జాతిరత్నాలు’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి.

‘రాజు గారు వస్తున్నారంటే మోత మోగిపోవాల్సిందే’.. యంగ్ హీరో సినిమాపై హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) ‘జాతిరత్నాలు’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక చివరగా.. ఆయన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) మూవీలో కనిపించాడు. ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడంతో ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రస్తుతం నవీన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ ‘అనగనగా ఒకరాజు’(AnaganagaOkaRaju) మూవీ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)నటిస్తోంది. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. కొన్నాళ్ల క్రితం ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. దీంతో నవీన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ విడుదల తేదీ రాబోతుందంటూ ఓ పోస్ట్ పెట్టి అందరిలో అంచనాలను పెంచారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అనౌన్స్‌మెంట్ మే 26న సాయంత్రం 4:6గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘రాజు గారు వస్తున్నారంటే.. ఈ మాత్రం హడావిడి ఉండొద్దు.. మోత మోగిపోవాల్సిందే’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story