Naveen Polishetty: వెస్ట్ గోదావరిలో నవీన్ పొలిశెట్టి మూవీ షూటింగ్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’.

Naveen Polishetty: వెస్ట్ గోదావరిలో నవీన్ పొలిశెట్టి మూవీ షూటింగ్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’ (Anaganaga Okaraju). ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌తో పాటు నవీన్ పొలిశెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తు్న్న ఈ సినిమాపై తాజాగా అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం.

‘అనగనగా ఒకరాజు’ సినిమా 2026 సంక్రాంతి స్పెషల్‌ (Sankranti Special)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ.. షూటింగ్‌ (Shooting)పై అప్‌డేట్ ఇచ్చారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న నవీన్‌పోలిశెట్టి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒకరాజు’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ శుక్రవారం పశ్చిమ గోదావరి (West Godavari)లో షెడ్యూల్‌తో ప్రారంభమవుతుంది. జనవరి 2026లో సంక్రాంతి సెలవులకు విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది!’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story