- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కరాలి’ సినిమాతో రాబోతున్న నవీన్ చంద్ర.. పవర్ ఫుల్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరాలి’(Karali).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరాలి’(Karali). రాకేష్ పొట్టా(Rakesh Potta) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై మొదటి సినిమాగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో నవీన్ చంద్ర సరసన రాశీ సింగ్(Rashi Singh) హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు ‘కరాలి’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఇక ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాహు స్క్రిప్ట్ అందించడంతో సాటు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఇక శ్రీహర్ణిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అయితే ‘కరాలి’ చిత్రబృందం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో కళ్లకు గంతలు కట్టుకొని ఉన్న నవీన్ చంద్ర ముందున్న గన్ పట్టుకుని ఉండగా.. ఆయన ముందు మంటలు ఓ పవర్ ఫుల్ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






