ఆకట్టుకుంటోన్న ‘నీలిరా’ ట్రైలర్

by Chukka Sudharani |

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నీలిరా’ చిత్రం ట్రైలర్ రిలీజైంది.

ఆకట్టుకుంటోన్న ‘నీలిరా’ ట్రైలర్
X

దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఈమేజ్ తెచ్చుకున్న నవీన్ చంద్ర.. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో ప్రేక్షకులను అలరించనున్నాడు. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే తమిళ యుద్ధ డ్రామా చిత్రం ‘నీలిరా’. సోమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సనంత్, రూప కొడువాయూర్, విధు, కపిల వేణు, రోహిత్ డి కొకటే అండ్ కయల్ విన్సెంట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ అండ్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్‌లపై సంయుక్తంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాను ప్రేక్షకుల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ, యాక్షన్ కలగలిపిన ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుంది. 1988 నాటి ఉత్తర శ్రీలంక నేపథ్యంలో, ఒక చిన్నారి కళ్ల ద్వారా చూసే యుద్ధం అండ్ ఒక కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Next Story