- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల తిరక్కుండానే ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన హార్రర్ మూవీ
నవీన్ చంద్ర హీరోగా నటించిన హనీ మూవీ ఫిబ్రవరి 27వ తేదీ నుండి తమిళ్, తెలుగు భాషల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఓటీటీలో సినిమాలు చూసే జనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో డిజిటల్ సంస్థల మధ్య పోటీ కూడా పెరుగుతోంది. దాంతో ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు దానిని వీలైనంత త్వరగా తమ ఓటీటీలో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో సన్ నెక్స్ట్ వారు కూడా పెద్ద ఎత్తున సినిమాలను కొనుగోలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నారు. కనీసం విడుదల అయ్యి నెల రోజులు కూడా కాకముందే ఈ సంస్థ వారు ఓ సినిమాను తమ ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. నవీన్ చంద్ర తాజాగా హనీ అనే హార్రర్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అజయ్ అరసాడ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు.
ఫిబ్రవరి 6వ తేదీన ఈ మూవీని విడుదల చేశారు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయినా ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీని ఫిబ్రవరి 27వ తేదీన తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్స్ట్ సంస్థ వారు ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






