Naveen Chandra: నేను ఎందుకు యాక్టర్ అయ్యానా అని నా మీదా నాకే కోపం వచ్చింది.. హీరో కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారత్-పాక్ యుద్ధం(India-Pakistan war)పై స్పందించాడు.

Naveen Chandra: నేను ఎందుకు యాక్టర్ అయ్యానా అని నా మీదా నాకే కోపం వచ్చింది.. హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారత్-పాక్ యుద్ధం(India-Pakistan war)పై స్పందించాడు. ‘మొన్న జరిగిన భారత్-పాక్ ఇన్సిడెన్స్‌తో అసలు నేను ఎందుకు యాక్టర్ అయ్యానా..? అని కోపం వచ్చింది నాకు. నేను పదవతరగతి పూర్తి చేశాక.. ఇంట్లో డిప్లమో జాయిన్ చేద్దాం అన్నారు. నాకు అప్పుడు మిలటరీ జాయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. ఎందుకంటే.. నాకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనేది కళ. ఆర్మీ(Army)లో ఉండాలని చాలా ఆశ పడ్డాను. కానీ ఫ్యామిలీలో.. కొడుకు మిలటరీకి వెళిపోతే ఎలా.. అంటూ కొన్ని వచ్చాయి. దీంతో నేను వెళ్లలేకపోయాను. కానీ మా తమ్ముడు మాత్రం సీఆర్‌పీఎస్‌లో ఉన్నాడు. ఇక మొన్న జరిగిన ఇన్సిడెన్స్‌తో నాకు అనిపించింది.. యంగ్ ఉన్న సమయంలో మిలటరీకి వెళ్లాలి అనే నా కళను అనవసరంగా వదులుకున్నాను.. జాయిన్ అవ్వాలనే నిర్ణయంపైనే ఉండి ఉంటే బాగుండేది అనుకున్నాను. ఎందుంటే ఆ టైంలో నేను వెళ్లి నా కంట్రీని సేవ్ చేసేవాడిని కదా అనిపించింది. ఆర్మీలలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు నా ఏజ్ కూడా అయిపోయింది. ఒకవేళ నాకు ఇప్పుడు కూడా అవకాశం వచ్చిన నేను జాయిన్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story