- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naveen Chandra: యముడు భూలోకానికి వచ్చి శిక్షలు విధిస్తే ఎలా ఉంటోంది.. ఆసక్తికరంగా టీజర్
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (Yamudu).

దిశ, సినిమా: జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (Yamudu). ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షికతో తెరకెక్కుతోన్న ఈ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు హీరో నవీన్ చంద్ర (Naveen Chandra). టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇక ఈ టీజర్(teaser)ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. ఫైనల్‌గా యముడు భూలోకానికి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా రూపుదిద్దిన ఈ టీజర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






