రవితేజ ‘మాస్ జాతర’ అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర.. అంచనాలను పెంచుతున్న కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-05-10 13:48:41.0  )
రవితేజ ‘మాస్ జాతర’ అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర.. అంచనాలను పెంచుతున్న కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), భాను భోగవరపు (Bhanu Bhogavarapu)కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(mass jathara). అయితే ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నింటికి సూపర్ రెస్పాన్స్ లభించగా.. ఇక ఇటీవల విడుదలైన సాంగ్‌లో ఇడియట్ బీట్ పెట్టి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది చిత్రబృందం.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ‘‘మాస్ జాతర షూట్ అయిపోవడానికి వచ్చింది. ప్రస్తుతం లాస్ట్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఓ రైట్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్‌తో నటించాను. బెస్ట్ కమర్శియల్ ఫిల్మ్ ఇదే. రవితేజ గారు నీరులాంటి వారు. చాలా నిజాయితీగా ఉంటారు. అందరితో బాగుంటారు. దేనికి స్ట్రెస్ట్ తీసుకోరు. ఎవరినీ అంతగా కంగారు పెట్టరు. ఆయన వర్క్ చూసుకుంటారు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ప్రొఫెషనల్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆయన స్వీట్ హార్ట్’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇందులో నవీన్ చంద్ర విలన్ పాత్రలో నటిస్తున్నాడా? లేక ఇతర క్యారెక్టర్ చేస్తున్నాడా? అనే ఆసక్తి నెలకొంది.



Next Story

Most Viewed