Andala Rakshasi: రీ రిలీజ్‌లో తన సినిమా తానే ఎంజాయ్ చేస్తున్న హీరో.. క్యూట్‌గా ఆకట్టుకుంటోన్న వీడియో

by Chukka Sudharani |

నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అందాల రాక్షసి’.

Andala Rakshasi: రీ రిలీజ్‌లో తన సినిమా తానే ఎంజాయ్ చేస్తున్న హీరో.. క్యూట్‌గా ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, సినిమా: నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి నిర్మించారు. ఇక 13 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ విభిన్నమైన ప్రేమకథగా, మనసును కట్టిపడేసే భావోద్వేగాలతో మెప్పించింది.

ఇన్నాళ్లకు మరోసారి ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేశారు చిత్ర బృందం. జూన్ 13వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రీరిలీజ్ కాగా.. సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవీన్ చంద్ర కూడా తన సినిమాను తాను రీరిలీజ్‌లో చూసుకుని ఎంజాయ్ చేశాడు. ‘ఏ మాంత్రమో అల్లేసిందిలా’ అనే సాంగ్ ప్లే అవుతుండగా.. పైకి లేచి డ్యాన్స్ చేశాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story