- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేచరల్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ది ప్యారడైజ్ వాయిదా!
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ గ్లోబల్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ ‘దసరా’ తర్వాత వీరి కాంబో మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు సిద్ధం కావడంతో.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక మూవీ పాన్ ఇండియా లెవల్‌లో 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషలలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు ఇది వాయిదా పడినట్లు తెలుస్తుంది.
స్క్రిప్ట్ అండ్ షెడ్యూల్ సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని, ఇప్పుడు ఈ షూటింగ్ మార్చి చివరి వరకు కొనసాగుతుండగా.. అదే నెలలో రిలీజ్ చేయడం కష్టమని భావిస్తున్నారట మేకర్స్. దీంతో పోస్ట్‌పోన్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుండగా.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వినికిడి. కాగా.. నాని రెండు జడలతో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్న ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లింక్
- Tags
- Nani
- The Paradise






