- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Natti Kumar: ఫిష్ వెంకట్ కు సభ్యత్వమే లేదు..అలాంటప్పుడు సాయం ఎందుకు చేయాలి ?
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ( Fish Venkat) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ ఉన్న

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ( Fish Venkat) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ ఉన్న సమయంలో.. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం రాలేదని.. సినిమా పెద్దలు సాయం చేసి ఉంటే ఆయన బతికి ఉండేవారని.. చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సభ్యత్వమే.. ఫిష్ వెంకట్ కు లేదు.. అలాంటప్పుడు ఎలా సహాయం చేస్తారు అని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఫిష్ వెంకట్ ఎక్కడో దూరంగా ఉంటున్నారని... 3000 రూపాయల నుంచి 30 వేల వరకు రెమినరేషన్ తీసుకునే స్థాయికి ఆయన ఎదిగినట్లు గుర్తించారు. అయితే డబ్బు సంపాదించినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేశారు.
ఆయన మా అసోసియేషన్ ( MAA) మెంబర్ కాదని... సభ్యత్వం కూడా తీసుకోలేదని వెల్లడించారు. సంబంధాలు ఉంటేనే సెలబ్రిటీలు వస్తారని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు నట్టి కుమార్. సినిమా ఇండస్ట్రీ తో సంబంధం ఉంటేనే సహాయం చేస్తారని... గుర్తు చేశారు. రేపు తన పరిస్థితి అయినా కూడా అలాగే ఉంటుందన్నారు. దీంతో నట్టి కుమార్ కామెంట్స్ వైరల్ గా మారాయి.






