టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్

by Muthe.Rajitha |

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు బుధవారం హాజరయ్యారు. ట్రైబల్ కమ్యూనిటీని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చిన విజయ్ దేవరకొండపై ఇప్పటివరకు కేవలం నామమాత్రంగా మాత్రమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కమిషన్ కు వివరించారు. అరెస్ట్ చేయకపోవడంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలని, సంబంధిత శాఖ ఎలా పనిచేస్తుందో అర్థం కావడంలేదని అన్నారు.

Next Story