- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాతో విక్టరీ వెంకటేశ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. 'Venky 77' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు త్రివిక్రమ్ కథ - మాటలు అందించారు. ఇవి రెండూ మంచి విజయం సాధించాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న మన శంకర వరప్రసాద్‌గారు చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో చేస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపైనా అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.
ఈ రెండు చిత్రాల అనంతరం వెంకటేష్ - అనుదీప్ కేవీ కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో వెంకటేశ్.. విశ్వక్‌సేన్‌తో అనుదీప్ సినిమాలు పూర్తయిన వెంటనే.. వీరి కాంబో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తుందని సమాచారం. ఇప్పటికే రష్మికకు అనుదీప్ స్టోరీ వినిపించారని.. ఆమె కూడా సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.






