- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna:‘చాలా బాధ కలుగుతోంది’.. బన్నీ అరెస్ట్ పై స్పందించిన నేషనల్ క్రష్ రష్మిక
పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre)కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కుటుంబ సభ్యులు, హీరోయిన్ రష్మిక మందన్న వచ్చారు.

దిశ,వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre)కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కుటుంబ సభ్యులు, హీరోయిన్ రష్మిక మందన్న వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. బన్నీ అరెస్ట్‌ను హీరోయిన్ రష్మిక తీవ్రంగా ఖండించారు. తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తిని నిందించడం సరి కాదని హితవు పలికారు. ఈ మేరకు రష్మిక ట్వీట్ చేశారు. ‘‘సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం, విచారకరం. కానీ ఈ విషయంలో అందరూ ఒకే వ్యక్తిని నిందించడం చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రస్తుతం నేను చూస్తున్నది నమ్మలేకపోతున్నా.. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది మరియు హృదయ విదారకమైనది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.






