నా జీవితంలోకి దారి చూపినందుకు ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ జోడించి రష్మిక మందన్న పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-05-04 15:55:14  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

నా జీవితంలోకి దారి చూపినందుకు ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ జోడించి రష్మిక మందన్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీకి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న సినిమాల్లో నటించినప్పటికీ.. ఆ మూవీస్ కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. తర్వాత ఏకంగా స్టార్ హీరోలైన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ బాలీవుడ్ ప్రముఖ హీరో అయిన రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో అవకాశం దక్కించుకుని.. మరింత స్టార్ డమ్ సంపాదించుకుంది.

రణబీర్ కపూర్‌కు భార్యగా.. పుష్ప మొదటి భాగంలో ఐకాన్ స్టార్‌కు ప్రేయసిగా.. సెకండ్ పార్ట్‌లో భార్యగా నటించి ఉత్తమ నటిగా పేరు గాంచింది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

అప్పుడప్పుడు సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వగా.. అప్పుడప్పుడు హాట్ హాట్ దుస్తుల్లో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటోంది. అయితే తాజాగా నేషనల్ క్రష్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నువ్వు చాలా ప్రేమలో ఉన్నావు. ఇప్పుడు, ఆ ప్రేమ నాకు చాలా చెప్పడానికి ఉంది. నా జీవితంలోకి దారి చూపినందుకు ధన్యవాదాలు’’ అంటూ తనను తాను కొనియాడుకుంది ఈ బ్యూటీ.

Next Story