Rashmika: ‘బండ మీద ఉంటుంది తొండా.. నీకూ కాబోయే మొగుడు విజయ్ దేవర కొండా’ అంటూ నెటిజన్ కామెంట్.. రష్మిక పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2025-04-20 13:32:21.0  )
Rashmika: ‘బండ మీద ఉంటుంది తొండా.. నీకూ కాబోయే మొగుడు విజయ్ దేవర కొండా’ అంటూ నెటిజన్ కామెంట్.. రష్మిక పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) గురించి తరచూ నెట్టింట వార్తలు గుప్పుమంటాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని జనాల భావన. రష్మిక-విజయ్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని వెనకొసుకొచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దీంతో వీరిద్దరి జంట చూడానికి చూడముచ్చటగా ఉండటంతో నెటిజన్లు మురిసిపోతూ కామెంట్లు చేస్తుంటారు.

రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తనకి చాలా మంచి స్నేహితుడు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామని కూడా పేర్కొంది. రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతుంది. అతన్ని తన అభిమాన నటుడిగా కూడా చెప్పుకొచ్చింది. కానీ రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని.. పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతాయి. ఇకపోతే తాజాగా నేషనల్ క్రష్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది.

గులాబి పువ్వు చేతిలో పట్టుకుని మురిసిపోతూ ఫొటో షూట్ చేసింది. అలాగే ఈ ఫొటోలకు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘నువ్వు చివరిసారిగా ఎప్పుడు పువ్వులు కొనుక్కున్నావు? నిన్ను నువ్వు తరచుగా అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం’’. అంటూ రాసుకొచ్చింది. ప్రెజెంట్ రష్మిక మందన్న పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఈ పువ్వు విజయ్ దేవరకొండ ఇచ్చాడని ఒకరు, బండ మీద ఉంటుంది తొండా.. నీకూ కాబోయే మొగుడు విజయ్ దేవర కొండా అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు.



Next Story