రష్మిక మందన్న పోస్ట్.. నాట్ నేషనల్ క్రష్.. మై క్రష్ అంటూ ఫ్యాన్స్ రిప్లైస్

by Anjali |
రష్మిక మందన్న పోస్ట్..  నాట్ నేషనల్ క్రష్.. మై క్రష్ అంటూ  ఫ్యాన్స్ రిప్లైస్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవలే సికందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఏ విధంగా జనాల్ని ఆకట్టుకున్నాయో.. సికందర్ థియేటర్లలోకి వచ్చాక ప్రజల నుంచి అంతే రెస్పాన్స్ లభించింది. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా సికందర్ మార్చి 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి జనాల్ని మెప్పించింది. ఐమాక్స్ ఫార్మాట్‌లో థియేట్రికల్‌గా విడుదలైన ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కథానాయకుడి నటించారు. ఈ సినిమాను AR మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన, కాజల్ అగర్వాల్‌తో పాటు సత్యరాజ్ కూడా కీలక పాత్రలో నటించారు.

ఇకపోతే ఈ బ్యూటీ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ నేషనల్ క్రష్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ‘ప్రతి రోజూ మార్నింగ్ నవ్వుతూ, అద్భుతమైన రోజు గడపడం మర్చిపోవద్దు’ అంటూ ఉదయం పూట క్యాప్షన్ జోడించి వీడియో పంచుకుంది. ప్రజెంట్ రష్మిక మందన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు ‘గుడ్ మార్నింగ్ మై సన్‌షైన్’ అంటూ రిప్లైస్ ఇస్తున్నారు.

Next Story

Most Viewed