Rashmika: నలుగురి పిల్లలకు తల్లే కాదు.. బామ్మ పాత్రలో నటించడానికి కూడా రెడీ.. నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-02-14 13:14:35  IST  )

బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది.

Rashmika: నలుగురి పిల్లలకు తల్లే కాదు.. బామ్మ పాత్రలో నటించడానికి కూడా రెడీ.. నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

నలుగురి పిల్లలకు తల్లే కాదు.. బామ్మ పాత్రలో నటించడానికి కూడా రెడీ.. నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక (National Crush Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఇటీవల పుష్ప-2 తో భారీ హిట్ కొట్టిన ఈ అమ్మడు జోరు మరింత పెంచింది. ప్రస్తుతం ఛావా (Chava) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో తన ప్రతిభ కనబర్చి.. నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నేడు థియేటర్లలోకి వచ్చిన ఛావా చిత్రంలో విక్కీ కౌశల్(Vicky Kaushal) , రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ఈ క్రమంలో రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యుకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు పంచుకుంది. ‘‘నేను ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోనని రష్మిక వెల్లడించింది. అలా ఆలోచిస్తూ పోతే ప్రతి చిన్న విషయం కూడా కష్టంగానే అనిపిస్తుందని తెలిపింది. కాగా నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ పోతానని పేర్కొంది. అలాగే ఎవరైనా మూవీ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు.. నేను ముందుగా స్టోరీకే ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పింది. స్టోరీ నచ్చినట్లైతే..

ఆ మూవీలో నలుగురి పిల్లలకు తల్లి మాత్రమే కాదు.. బామ్మ రూల్‌లో నటించడానికి కూడా సిద్ధమని.. వెనకాడనంటూ నేషనల్ క్రష్ చెప్పుకొచ్చింది. అలాగే నేను నటిస్తోన్న మూవీల సక్సెస్ వెనక ఎలాంటి ప్రణాళికలు లేవని.. విజయం అనేది మన చేతిలో ఉండదని పేర్కొంది. ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని.. అదృష్టవశాత్తూ సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయని వెల్లడించింది. జనాలు కూడా నా సినిమాలు ఆదరిస్తున్నందుకు.. నా మీద చూపిస్తోన్న అభిమానానికి చాలా హ్యాపీగా ఉందని వివరించింది.

అలాగే ఛావా చిత్రంలో నాకు అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. అంతేకాదు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇందులో యేసుబాయి పాత్రలో నటించానని.. ఇలాంటి రూల్‌లో నటించే చాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉందని.. ఎప్పుడు ఈ పాత్రలో నటిస్తానని అనుకోలేదని రష్మిక మందన్న పేర్కొంది. నాకు తెలిసి ప్రతి ఒక హీరో ఇలాంటి స్టోరీలో భాగం కావాలని అనుకుంటారని చెప్పింది.

మనం సాధారణంగా ఛత్రపతి శివాజీ గురించి తమ కుమారుడు శంభాజీ గురించి పుస్తకాల్లో చదివినప్పుడు అంతగా డెప్త్‌గా ఊహించుకోలేమని.. కానీ తమ జీవితాల్ని స్క్రీన్ పై వీక్షించినప్పుడు నిజంగా కళ్లకు కట్టినట్లే అనిపిస్తాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నేషనల్ క్రష్ ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend), సల్మాన్ ఖాన్-మురుగదాస్ కలయికలో వస్తోన్న సికిందర్ మూవీలో, కుబేర వంటి సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కిరిక్ పార్టి(Kirik Party), అంజని పుత్ర, చమక్, ఛలో, గీత గోవిందం(Geeta Govindam), దేవదాస్ , యజమన, డియర్ కామ్రేడ్(Dear Comrade), సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతా రామం, గుడ్ బై, వారసుడు, మిషన్ మజ్ను(Mission Majnu), అనిమల్, పుష్ప 2: ది రూల్, వెంకీ కుడుములు సినిమా, రెయిన్‌బో (Rainbow) వంటి సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

Next Story