Daku maharaj: తలలు తెగిపోతున్నాయ్..!(Video Viral)

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-12 06:28:56  IST  )

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ రిలీజ్ అయింది...

Daku maharaj: తలలు తెగిపోతున్నాయ్..!(Video Viral)
X

దిశ, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nanda Muri Bala Krishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) రిలీజ్ అయింది. ఈ తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి కొనసాగుతోంది. బాలకృష్ణ ఊర మాస్ యాక్టింగ్ దెబ్బకు అటు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. బాలయ్య దబిడిదిబిడికి డ్యాన్స్‌తో దంచేస్తున్నారు. తెరపై సినిమా చూసి కాలర్ ఎగురవేస్తున్నారు. తమ హీరోదే మళ్లీ సంక్రాంతి(Sankranti) అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తలలు తెగిపోతున్నాయ్...!


అయితే ఈ తెల్లవారుజామున సినిమా రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి చేశారు. బాలయ్య కటౌట్లను పూలు, పాలాభిషేకం చేశారు. అయితే ఇదంతా బాలకృష్ణ ప్రతీ సినిమాకు జరిగేదే. కానీ ఈసారి బాలయ్య ఫ్యాన్స్ రక్తం కళ్ల చూశారు. సినిమా హిట్ కావాలని బాలయ్య కటౌట్ వద్ద జంతు హింసకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ఈ షోల ప్రదర్శనకు ముందే మేకలు, గొర్రెల తలలను ఒక వేటుతో నరికి సినిమా హిట్ కావాలని కోరుతున్నారు. అయితే కొన్ని చోట్ల బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతి దక్కలేదు. దీంతో ఈ ఉదయం 11 గంటలకు థియేటర్లలో బొమ్మ పడనుంది.

ఒక్క వేటుతో..


దీంతో అక్కడ కూడా మేకలు, గొర్రెలను సిద్ధం చేశారు. సినిమా ప్రారంభానికి ముందు ఒక వేటుతో తల నరికి మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఇప్పటికే డాకు మహారాజ్ రిలైన థియేటర్ల వద్ద చేసిన హంగామాను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు తలలు తెగిపోతున్నాయ్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు జంతు హింస చేయకూడదని అని మండిపడుతున్నారు. ఏది ఏమైనా సినిమా విడుదల సందర్భంగా ‘జంతు బలి’ మంచి పని కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా మారాలని సాధారణ జనం కోరుకుంటున్నారు. క్రమ శిక్షణలో ముందుంటే బాలయ్య ఫ్యాన్స్ ఈ ఒక్క విషయంలో ఇకనైనా మారతారేమో చూడాలి.

Next Story