- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు నిర్మాతతో నార్ని నితిన్ కొత్త ప్రాజెక్ట్
నార్ని నితిన్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' బ్యానర్‌లో తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ వరుసగా 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' చిత్రాలతో విజయాలను అందుకుని మంచి గుర్తింపును సంపాదించారు. ఈయన కెరీర్ లో 'శ్రీశ్రీశ్రీ రాజావారు' చిత్రం మొదటగా ప్రారంభం అయింది. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా విడుదలై అపజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా, ఈ యువ హీరో తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలో చేయబోతున్నట్లు సమాచారం. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నార్ని నితిన్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయని, మరికొద్ది రోజుల్లో దర్శకుడు సహా ఇతర వివరాలతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయగన్' చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇక ఇదే నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నట్లు సమాచారం.






