- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి బరిలోకి శర్వానంద్ సినిమా.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా రామ్ అబ్బారాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దిశ, వెబ్ డెస్క్: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా రామ్ అబ్బారాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అంతే కాకుండా సినిమాలో శర్వానంద్ కు జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక తాజాగా సినిమాపై దీపావళి పండుగ సందర్భంగా చిత్రయూనిట్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించింది. గతంలో శర్వా నటించిన శతమానంభవతి సినిమా సంక్రాంతికే వచ్చి హిట్ కొట్టడంతో ఈ సారి కూడా అదే పండుగకు బరిలో నిలవాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేయగా శర్వానంద్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఇక సంక్రాంతి సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొడుతుందా లేదా చూడాలి.






