- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nari Nari Naduma Murari: టీజర్ అదుర్స్..ఇద్దరు భామల మధ్య నలిగిపోతున్న శర్వానంద్..
టీజర్ ను చిత్ర బృందం కాసేపటికి క్రితమే రిలీజ్ చేసింది. ఈ టీజర్ సినిమా హైప్ ను

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న శర్వానంద్, ఇద్దరు భామలతో వచ్చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. ఈ మూవీ కంప్లీట్ గా ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్ గా మెరువనున్నారు. సునీల్, నరేష్, సత్య, బ్రహ్మాజీ లాంటివాళ్ళు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం కాసేపటికి క్రితమే రిలీజ్ చేసింది. ఈ టీజర్ సినిమా హైప్ ను అమాంతం పెంచింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల మధ్య శర్వానంద్ నలిగిపోయిన సన్నివేశాలను అద్భుతంగా తెరిగెక్కించారు. అలాగే ఒకరికి తెలియకుండా మరొకరిని శర్మ, ఎలా వాళ్లను మెయింటైన్ చేశాడన్నది సినిమా స్టోరీ. ఇది ఇలా ఉండగా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14వ తేదీన ఈ 'నారీ నారీ నడుమ మురారి' సినిమా రిలీజ్ కానుంది.






