‘నారి నారి నడుమ మురారి’.. శర్వా మూవీ రిలీజ్‌కు డిఫరెంట్ ప్లాన్

by Sujitha Rachapalli |

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి బరిలో నిలవనుంది. ‘సామజ వరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు

‘నారి నారి నడుమ మురారి’.. శర్వా మూవీ రిలీజ్‌కు డిఫరెంట్ ప్లాన్
X

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి బరిలో నిలవనుంది. ‘సామజ వరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించిన సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ గురించి మేకర్స్ ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమాను ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల చేయనున్నామని.. ప్రీమియర్ షో సమయం సాయంత్రం 5:49 గంటలకు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్‌ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్‌ను తెలియజేస్తోంది. అంతేకాదు హీరో శర్వా గత సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌లు ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా జనవరి 14న విడుదలయ్యాయి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. సెలవుల సీజన్‌లో తీవ్రమైన పోటీ ఉన్నందున ఈ పండుగ సందర్భంగా రిలీజ్ కాస్త ఆలస్యంగా రావడం సినిమాకు బెనిఫిట్ కానుందని అంటున్నారు విశ్లేషకులు.

Next Story