- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IFFI రెడ్ కార్పెట్‌పై “నారి”
గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ భారత ఛలనచిత్రోత్సవం (IFFI)లో, మా చిత్రమైన “నారి” రెడ్ కార్పెట్‌పై నిలబడటం మా మొత్తం బృందానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. ఈ సంవత్సరం IFFI కి ఇండియన్ పనోరమ తరపున స్పెషల్ స్క్రీనింగ్ లో మన తెలుగు సినిమా

X
దిశ, సినిమా : గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (IFFI)లో “నారి” రెడ్ కార్పెట్‌పై నిలబడటం మా మొత్తం బృందానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నామని తెలిపింది చిత్ర బృందం. ఈ సంవత్సరం IFFI కి ఇండియన్ పనోరమ తరపున స్పెషల్ స్క్రీనింగ్ లో మన తెలుగు సినిమా “నారి” చోటు దక్కించుకోవడం ఒక తొలి దర్శకుడిగా నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు తమ చిత్రం ఫిలింఫెస్టివల్స్‌లో 4 అవార్డులు అందుకుందని.. ఇవి మా ప్రయాణాన్ని మరింత బలపరచిన మైలురాళ్లు అని తెలిపారు. “నారి” కథలో ఉన్న భావోద్వేగం, మహిళ శక్తి గురించి చెప్పే సందేశం.. ప్రపంచ ప్రేక్షకులను ఇంకా ఎంతో దూరం తీసుకెళ్తుందని నమ్ముతున్నామని చెప్పారు. ఈ చిత్రం భవిష్యత్తులో కూడా మరెన్నో అంతర్జాతీయ గుర్తింపులు, జాతీయ అవార్డులు కూడా అందుకుంటుందనే నమ్మకం మా బృందానికి ఉందన్నారు.
Next Story






