- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి మా అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు.. అది చూసి నేను ఏడ్చాను.. నరేష్
తాజాగా నరేష్ మాట్లాడుతూ... ఒకరోజు రాత్రి పదిన్నరకు మా అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అందులో నన్ను మిస్ అవుతున్నానని ఉంది. దానితో మేమిద్దరం ఎంతో ఏడ్చేశాము అని చెప్పారు.

దిశ, వెబ్ డిస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన కామెడీ హీరోగా కెరీర్ను కొనసాగించిన నరేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైంలో నరేష్ నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందులోని ఆయన పాత్రలకి గొప్ప ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా నరేష్ హే బల్‌వంత్ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది.
దానితో నరేష్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. తాజాగా నరేష్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. అందులో ఆయన తన పర్సనల్ విషయాలను కూడా తెలియజేశాడు. తాజాగా నరేష్ మాట్లాడుతూ... మా అబ్బాయి నవీన్, నేను ఇద్దరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటాం. మేము ఎవరి పనుల్లో వారు ఉన్నా కూడా ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.
కానీ మేము బిజీగా ఉండడం వల్ల మా మధ్య ఎక్కడో దూరం పెరిగింది అనే భావన మాత్రం ఉంటూ వస్తుంది. ఒకరోజు మా అబ్బాయి నాకు రాత్రి మెసేజ్ పెట్టాడు. అందులో నా చైల్డ్ హుడ్ ఎంతో బాగుండేది అని ఉంది. అది దాదాపు పదిన్నర సమయం, ఆ టైంలో నేను పడుకుంటాను. ఆ మెసేజ్కు నేను ప్రస్తుతం ఏమయింది అని రిప్లై ఇచ్చాను. దానితో మా అబ్బాయి నేను నీ ప్రేమను మిస్ అవుతున్నాను అని అన్నాడు. దానితో మేమిద్దరం ఎంతో ఏడ్చేసాము అని చెప్పుకొచ్చాడు.






