హే భగవాన్ అలాంటి సినిమా.. ఖచ్చితంగా హిట్ అవుతుంది.. నరేష్

by Pulgam srinivas |

తాజాగా నరేష్ మాట్లాడుతూ... కె-ర్యాంప్ మంచి విజయం సాధిస్తుంది అంటే ఎవరూ నమ్మలేదు. 'నారీ నారీ నడుమ మురారి' కూడా సక్సెస్ అవుతుందని అన్నాను, చెప్పినట్లే సంక్రాంతి విన్నర్ అయింది. 'హే భగవాన్' సినిమా కూడా విజయం సాధించబోతోందని నరేష్ తెలియజేశారు.

హే భగవాన్ అలాంటి సినిమా.. ఖచ్చితంగా హిట్ అవుతుంది.. నరేష్
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా నరేష్, సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా గోపి దర్శకత్వంలో రూపొందిన హే భగవాన్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో నరేష్, నటి మరియు తన భార్య అయినటువంటి పవిత్రతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో ఆయన ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా గతంలో తాను నటించిన కొన్ని సినిమాల గురించి కూడా తెలియజేశాడు. నరేష్ మాట్లాడుతూ... "నేను కొంత కాలం క్రితం కె- ర్యాంప్ మూవీలో నటించాను. అది మంచి విజయం సాధిస్తుంది అని నేను చెప్పాను. కానీ అప్పుడు నా మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఈ సంక్రాంతికి నేను నటించిన నారీ నారీ నడుమ మురారి విడుదల అయింది. ఆ మూవీ అనేక సినిమాలతో పోటీగా విడుదల అయింది.

ఆ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది అన్నాను. ఆ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక హే భగవాన్ సినిమా గురించి కూడా అంతే కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. సుహాస్, శివానీ బాగా నటించారు. గోపి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ మూవీ నా కెరియర్లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది" అని నరేష్ తెలియజేశారు.

Next Story