- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ సీన్ ఫన్ జోన్.. కొత్త సినిమా అదిరిపోయింది..
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు.

దిశ, సినిమా : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ఈ నెల 19న మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. ఇందుకు సంబంధించిన హైలెట్స్ పంచుకున్నాడు హీరో. ‘తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ లైన్. డార్క్ కామెడీ మూవీస్ అనే జానర్‌లో మనకు గతంలో మూవీస్ వచ్చాయి గానీ అవి డార్క్ కామెడీ అని ట్యాగ్ పెట్టలేదు. ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే వాడికి బాధ కానీ మనకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ. ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భాలు ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సినిమా అంతా ఫన్ జోన్‌లో వెళ్తుంటుంది. ఈ మూవీకి బలమైన కథ ఉంది. ప్రతి సీన్ కామెడీగా వెళ్తున్నా వెనక ఒక స్ట్రాంగ్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఇంటర్వెల్‌కు ఆడియెన్స్ షాక్ అవుతారు’ అని తెలిపాడు. ఇంతకు ముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్ చేశానని.. బ్రహ్మానందంతో కాంబినేషన్ సీన్స్ లేవు కానీ యోగి బాబుతో ఉన్నాయని చెప్పాడు. ఎంత మంచి స్క్రిప్ట్ ఉన్నా దాన్ని పర్ఫార్మ్ చేసే ఆర్టిస్టులు ఉండాలని.. మూవీలో ఫరియా, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ మంచి కామెడీ టైమింగ్‌తో నటించారన్నాడు.






