- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరసింహ సినిమాకు సీక్వెల్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్
రజనీకాంత్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నరసింహ.

దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నరసింహ. కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు, క్లాసిక్ కల్చర్ ఐకాన్ గా నిలిచింది. దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో చేసిన “పడయప్ప” (తెలుగులో “నరసింహ”) సినిమా 1999లో విడుదలై, అప్పటి తమిళ సినిమా రికార్డులు షేక్ చేసింది. రమ్య కృష్ణన్ ‘నీలాంబరి’ క్యారెక్టర్‌తో ఇమ్మార్జెస్‌బుల్ అయ్యారు. ఇప్పుడు ఆ చిత్రానికి 25 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో, సూపర్‌స్టార్ 75వ పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా తమిళ వెర్షన్ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్ల ముందు క్యూలు పెట్టుకునేందుకు రెడీ అయ్యారు.
కాగా.. మేకర్స్ రీరిలీజ్ ప్రమోషన్‌గా విడుదల చేసిన 37 నిమిషాల స్పెషల్ వీడియోలో రజనీకాంత్ ఒక కీలక విషయాన్ని చెప్పారు. సినిమా మెమరీలు షేర్ చేస్తూ, “2.0, జైలర్ 2 లాంటి సీక్వెల్స్ చూస్తుంటే… పడయప్ప 2 ఎందుకు కాదు? ‘పడయప్ప -2కి నీలాంబరిగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలపారు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయి. ఇది మంచిగా లైన్ అప్ అయితే.. ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ లాంటి సెలబ్రేషన్ అవుతుంది” అని కన్ఫర్మ్ చేశారు. అంటే.. రమ్య కృష్ణన్ ‘నీలాంబరి’ క్యారెక్టర్‌తో మళ్లీ తిరిగి వస్తారా? లేక కొత్త హీరోయిన్‌తో రీఇమాజిన్ చేస్తారా? రజనీకాంత్ మాటల్లో “మళ్లీ ఒక నీలాంబరి” అని చెప్పారు కాబట్టి, రమ్యా కృష్ణన్ వెర్షన్‌లోనే కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. గతంలో ఈ రోల్‌కి ఐశ్వర్యా రాయ్‌ని తీసుకోవాలని భావించగా.. ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత రమ్య జాయిన్ అయ్యారు. మరి ఈసారి ఏమవుతుందో వేచి చూడాలి.






