- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరో ఇంట పెళ్లి సందడి..బాలయ్య గ్రాండ్ ఎంట్రీ
ప్రతినిధి 2 సినిమాలో నటించిన శిరీషను నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళ పెళ్లి వేడుక ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ నారా రోహిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. నారా కుటుంబం నుంచి వచ్చిన రోహిత్, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే తీస్తాడు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చాడు కానీ అప్పట్లో... ఇండస్ట్రీని షేక్ చేసేలా సినిమాలు తీశాడు. అయితే అలాంటి టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
ఈ నెల 30వ తేదీన నారా రోహిత్ పెళ్లి జరగనుంది. ప్రతినిధి 2 సినిమాలో నటించిన శిరీషను నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళ పెళ్లి వేడుక ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక శనివారం రోజున హల్దీ వేడుక కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాలి. ఇక ఈ పెళ్లికి వేడుకల నేపథ్యంలో సాంప్రదాయ దుస్తుల్లో నందమూరి బాలయ్య కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. క్లిక్






