- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నారా రోహిత్ కొత్త సినిమా
దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇవ్వడంతో నారా రోహిత్ కొత్త సినిమా అధికారికంగా ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: నారా రోహిత్ “సుందరకాండ” చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మణికుమార్ దర్శకత్వంలో నారా రోహిత్ తన తదుపరి సినిమాను చేయబోతున్నారు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇవ్వడంతో ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది. ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు.
అందుకే తాత్కాలికంగా “RN 23” అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అయితే ఈ చిత్రానికి “సౌండ్ ఇంజనీర్” అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. “సుందరకాండ” తర్వాత నారా రోహిత్ అనేక కథలు విన్నప్పటికీ చాలా కథలను రిజెక్ట్ చేసిన తరువాత చివరికి ఈ స్టోరీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.






