సిద్ధమవుతున్న 'చిచోరా'.. నితిన్ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది

by Pulgam srinivas |   (  Updated:2026-05-11 08:28:19  IST  )

“చిచోరా రెడీ” అంటూ తన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన నితిన్.

సిద్ధమవుతున్న చిచోరా.. నితిన్ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు నితిన్ తన తదుపరి సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. నరి, సోమశేఖర్ అనే కొత్త దర్శకులు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను నితిన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆయన “hold on boys... CHICHORA getting ready” అంటూ అద్దం ముందు కూర్చొని వెనుక వైపు కనిపించేలా ఉన్న ఫోటోను తన అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమా కోసం నితిన్ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 13 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించనుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారు.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నారా రోహిత్ కొత్త సినిమా

Next Story