- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Rohith: ఆమెకు స్పెషల్ విషెస్ చెప్తూ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ‘సోలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ‘సోలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు కానీ పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. దీంతో కొద్ది కాలంగా పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మళ్లీ ఈ ఏడాది ‘ప్రతినిధి-2’(Prathinidhi -2) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నారా రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన ‘ప్రతినిధి-2’ హీరోయిన్ సిరి లెల్ల(Siri Lella)తో ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఆయన భార్య భువనేశ్వరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం ఈ లవ్ బర్ద్స్ వెకేషన్స్‌కు వెళ్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేడు సిరి లెల్ల పుట్టిన రోజు కావడంతో నారా రోహిత్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘మీ ప్రత్యేక రోజున, మీరు నా పట్ల ఎంత భావాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజూ ప్రకాశించే సూర్యరశ్మి, ప్రతి తుఫానులో ప్రశాంతత ప్రేమను చూపిస్తారు. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా హ్యాపీ బర్త్ డే నానా సిరి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విషెస్ చెప్తూనే రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






