రెండు విభిన్న ప్రేమ కథలతో రాబోతున్న నారా రోహిత్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by Chukka Sudharani |

‘భైరవం’(Bhairavam) హిట్ తర్వాత నారా రోహిత్ (Nara Rohit) ప్రస్తుతం తన 20వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

రెండు విభిన్న ప్రేమ కథలతో రాబోతున్న నారా రోహిత్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ‘భైరవం’(Bhairavam) హిట్ తర్వాత నారా రోహిత్ (Nara Rohit) ప్రస్తుతం తన 20వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి(Director Venkatesh Nimmalapudi) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకల్లి నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ కాగా.. రోహిత్ పాత్ర ప్రేక్షకులకు నవ్వులను పూయించింది. ఈరోజు, నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రం విడుదల తేదీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘సుందరకాండ’ (Sundarakanda)చిత్రం ఆగస్టు 27న గణేష్ చతుర్థి రోజున గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.

విడుదల తేదీ పోస్టర్ రోహిత్ యెక్క రెండు విభిన్న ప్రేమకథలను చూపిస్తుంది. ఇందులో ఒకటి శ్రీదేవి విజయ్ కుమార్‌(Sridevi Vijay Kumar)తో కలిసి ఉండగా.. మరొకటి వ్రితి వాఘాని(Vrithi Vaghani)తో కలిసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ఎంతో సమయం లేనందున.. నిర్మాతలు ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో వ్రితి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, హాస్యనటుడు సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ట్వీట్ :

Next Story