- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకీ మామ సినిమాలో నారా హీరో..త్రివిక్రమ్ భారీ ప్లాన్ ?
త్రివిక్రమ్, వెంకీ మామ కలిసి తీస్తున్న కొత్త సినిమాలో నారా హీరో నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ ( Venkatesh) వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇక ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేసి సందడి చేశారు వెంకీ మామ. ఇక అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. అది విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 77వది కావడం గమనార్హం.
ఈ సినిమాకు ఇప్పటికే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే డిఫరెంట్ టైటిల్ తో వెంకటేష్ వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ఆ ప్రారంభమైందట. ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కామెడీ, జోనర్ లో వస్తున్నట్లు సమాచారం.
వెంకీ మామ సినిమాలో నారా రోహిత్ ?
త్రివిక్రమ్, వెంకీ మామ కలిసి తీస్తున్న కొత్త సినిమాలో నారా హీరో నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం నారా రోహిత్ ను సంప్రదించారట. ఈ పాత్రకు నారా రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ కాగా, రెండో హీరోయిన్ గా రుక్మిణీ లేదా నిధి అగర్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ సమ్మర్ లో రాబోతోంది.






