- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త దర్శకుడితో చేతులు కలిపిన నారా రోహిత్
నారా రోహిత్ కొత్త చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి మణికుమార్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఆఖరుగా ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకుని, పెద్ద స్థాయిలో ప్రమోషన్లు కూడా నిర్వహించాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేక యావరేజ్ విజయంతో సరిపెట్టుకుంది. ఈ సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న నారా రోహిత్ తాజాగా మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఆయన కెరీర్‌లో 23వ చిత్రం కాగా ప్రస్తుతం “RN 23” అనే వర్కింగ్ టైటిల్‌తో లాంచ్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు మణికుమార్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. భరత్ చౌదరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ‘సుందరకాండ’ తర్వాత అనేక కథలను పరిశీలించి చివరకు ఈ కథను ఓకే చేసినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంతో నారా రోహిత్‌కు మంచి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






