- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది ప్యారడైజ్’ నుంచి నాని పోస్టర్ రిలీజ్.. రెండు జడలు వేసుకుని డిఫెరెంట్ లుక్‌లో షాకిచ్చాడుగా..
నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise).

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇక దీనికి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకు ముందు వీర కాంబోలో వచ్చిన ‘దసరా’(Dasara) ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ మూవీ 2026 సమ్మర్‌లో మార్చి26న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
అయితే.. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చి అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రసెంటింగ్ జడల్ అంటూ నాని రెండు జడలతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే మరొక పోస్టర్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసిన నాని పోస్టర్‌ను చూస్తే.. హాలీవుడ్ సినిమా మెన్ ఇన్ బ్లాక్3లో విలన్ పాత్రదారి బోరిస్ ది ఎనిమల్ లుక్‌ను పోలి ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






