- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దండోరా డైరెక్టర్‌తో నాని కొత్త సినిమా ఫిక్స్
నాని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో 'దండోరా' దర్శకుడు 'మురళీకాంత్ దేవాసోత్' తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి, వరుసగా సరికొత్త కాన్సెప్ట్‌లతో చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్ ద్వారా ఇప్పటికే పలువురు యువ దర్శకులకు అవకాశాలు ఇచ్చిన నాని, తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన దండోరా చిత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీకాంత్ దేవాసోత్ తన డెబ్యూ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు తన రెండో సినిమాను నాని నిర్మాణ సంస్థలో చేయబోతున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో యువ నటుడు నాస్లెన్ కథానాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. నాస్లెన్ తెలుగులో ఇప్పటివరకు సినిమాలు చేయకపోయినా, అనేక మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన కథ చర్చలు పూర్తయినట్లు, మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.






