- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NANI: సెన్సార్ పూర్తి చేసుకున్న నాని ‘హిట్-3’ సినిమా.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేస్తూ షాకింగ్ ట్వీట్..
టాలీవుడ్ స్టార్ హీరో నాని(NANI) అందరికీ సుపరిచితమే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్-3’(Hit-3).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాని(NANI) అందరికీ సుపరిచితమే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్-3’(Hit-3). అయితే ఈ సినిమా ఘన విజయం సాధించిన ‘హిట్’ సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu)దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే దీనిని నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని(Prasanthi Thipirneni) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
గత ఏడాది షూటింగ్ మొదలవగా నాని ఈ సారి ఊహించని విధంగా ఉండేలా తన లుక్‌ను మార్చుకుని ‘హిట్-3’ కోసం పలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌కు ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. నాని అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. అంతేకాకుండా పలు అప్డేట్స్‌ను కూడా ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ నాని పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుపుతూ రక్తంతో తడిసిముద్దయిన నాని పోస్టర్‌తో అందరినీ షాక్‌కు గురి చేశారు. అంటే.. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారు వెళ్ళడానికి వీలు లేదన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ రేటింగ్‌ను బలమైన హింస, స్పష్టమైన లైంగిక సన్నివేశాలు లేదా దుర్భాషలాడే చిత్రాలకు ‘A’ సర్టిఫికెట్ కేటాయించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
A for ARJUN SARKAAR
— Nani (@NameisNani) April 25, 2025
CERTIFIED. #HIT3 #HIT3FromMay1st pic.twitter.com/9PPKLwKEEJ






