జీన్స్‌లో యూత్ మనసుల్ని కొల్లగొడుతున్న నాని హీరోయిన్.. లేటెస్ట్ పోస్ట్ వైరల్

by I. Sairam |

యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జీన్స్‌లో యూత్ మనసుల్ని కొల్లగొడుతున్న నాని హీరోయిన్.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఒంద్ కథె హెళ్ల’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’(Gang Leader) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక విక్రమ్ కుమార్(Vikram Kumar) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా భాషతో సంబంధం లేకుండా తమిళం, మలయాళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ జీన్స్ లోపల బ్లాక్ స్లీవ్‌లెస్‌పై మిక్స్డ్ కలర్ షర్ట్ వేసుకుంది. ఇక ఈ పిక్స్ యూత్‌కు మనసులు కొల్లగొట్టేలా ఉన్నాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story