Nani: ఆ స్టార్ హీరోపై బయోపిక్ తీయాలని ఉంది.. నేచులర్ స్టార్ నాని వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

రీసెంట్‌గా హిట్-3తో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Nani: ఆ స్టార్ హీరోపై బయోపిక్ తీయాలని ఉంది.. నేచులర్ స్టార్ నాని వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా హిట్-3తో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘ది ప్యారడైజ్’ ఒకటి. దీనిని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరెకెక్కిస్తున్నాడు. ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబోలో.. ఇప్పుడు ప్యారడైజ్ రూపొందబోతుండటంతో ఫ్యా్న్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే అంచనాలు నెక్ట్స్ లెవెల్‌ను చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. 2026 మార్చి 26న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నాని పలు ఇంటర్వ్యూస్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్స్‌తో పాటు, సినిమాలు విశేషాలు కూడా పంచుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సూపర్ స్టార్ రజినీకాంత్‌పై ఉన్న ఇష్టాన్ని మరోసారి తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. ‘బయోపిక్ చేసే అవకాశం ఎప్పుడైనా వస్తే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ సార్‌పై బయోపిక్ చేయడానికి నేను ఇష్టపడతాను. అది కేవలం బయోపిక్ కాదు.. నా కలల ప్రాజెక్ట్ అవుతుంది’ అని తెలిపారు. ప్రజెంట్ నాని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్

Next Story