ప్రతీ కథకు హీరో అవసరం.. టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచేసిన నాని

by Chukka Sudharani |

కన్నడ స్టార్ హీరో డా. శివరాజ్ కుమార్, డా. ధనంజయ (దాళి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ రెట్రో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’.

ప్రతీ కథకు హీరో అవసరం.. టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచేసిన నాని
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో డా. శివరాజ్ కుమార్, డా. ధనంజయ (దాళి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ రెట్రో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. 1970 బ్యాక్ డ్రాప్‌లో హేమంత్ ఎమ్.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాతా ఈ మూవీ నుంచి టీజర్‌ను నేచురల్ స్టార్ నాని తన ఎక్స్ అకౌంట్ వేదికగా విడుదల చేశాడు. ‘నాన్న ప్రతి కథకు ఒక హీరో కావాలని చెప్పాడు’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే.. ఇందులో శివరాజ్ కుమార్ ఓ ఏంజెట్ పాత్రలో కనిపిస్తుండగా, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. అదితి బాలన్, ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈమూవీకి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. వైశాఖ్ జె. ఫిలిమ్స్ పతాకంపై డా. వైశాఖ్ జె. గౌడ నిర్మిస్తున్నారు.

Next Story