- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది పారడైజ్ : జడల్ న్యూ లుక్ వచ్చేసింది..
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి నిర్మాత. కాగా మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి నిర్మాత. కాగా మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్ ఫుల్‌గా, తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు.
స్ట్రాంగ్ ఫిజిక్, పొడవైన జడలు కట్టిన జుట్టు, రగ్గడ్ గడ్డం, మీసాలతో నాని లుక్ అదిరిపోయింది. రెడ్ టింట్ గ్లాసులు, మెటల్ చైన్స్, స్లీవ్‌లెస్ బ్లాక్ అవుట్‌ఫిట్ అతని పాత్రలోని ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబంధించినదిగా తెలుస్తోంది. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్.. కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కాగా మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.






