- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హిట్-3’లో స్టార్ హీరో కీ రోల్.. ఊహించని సర్‌ప్రైజులు చూడబోతున్నారంటూ హైప్ పెంచేసిన నాని (వీడియో)
టాలీవుడ్ హీరో నాని(nani) గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాని(nani) గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నాని ‘హిట్-3’(Hit-3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నాని సరసన పాన్ ఇండియా బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘హిట్-3 సినిమాలో సర్‌ప్రైజ్ ఉన్నాయి. అయితే కొంతమంది కాపీ పేస్ట్ అంటూ వార్తలు రాస్తున్నారు. అలాగే ఎవరు ఏమనుకున్నా ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజులు చూడబోతున్నారు. కానీ ప్రేక్షకులు థియేటర్స్‌లోనే వాటిని చూసి ఎంజాయ్ చేయాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది తెలుసుకున్న వారంతా కార్తీ హిట్-3లో కామియో రోల్ చేయబోతున్నారు. నాని కూడా దాని గురించే చెప్పాడని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఆ సర్‌ప్రైజులు ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాపిటీ పెరిగిపోయింది.






