Hit-3: పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో.. హిట్-3పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నాని

by Chukka Sudharani |   (  Updated:2025-04-10 13:16:03  IST  )

హిట్ (Hit) ఫ్రాంచైజీలో రాబోతున్న ‘హిట్-3’(Hit-3)పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hit-3: పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో.. హిట్-3పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నాని
X

దిశ, సినిమా: హిట్ (Hit) ఫ్రాంచైజీలో రాబోతున్న ‘హిట్-3’(Hit-3)పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేచురల్ స్టార్ నాని (Nani) లీడింగ్‌లో రోల్‌లో నిటిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar) అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ (Police officer) పాత్రలో కనిపించనుండగా.. ఇప్పటికే వచ్చిన టీజర్ (teaser), ఫస్ట్ లుక్ (First look) వంటి అప్‌డేట్స్‌కు సోషల్ మీడియా(Social media)లో విపరీతమైన స్పందన లభించింది. దీంతో.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్ర్కీన్లపై చూద్దామా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ మే-1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా నాని ‘హిట్-3’ ట్రైలర్ (Trailer) అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన X అకౌంట్ వేదికగా.. ‘‘హిట్-3’ యొక్క రక్త ప్రవాహం ఏప్రిల్ 14న రాబోతుంది’ అంటూ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చాడు నాని. ఇక షేర్ చేసిన పోస్టర్‌లో హీరో షూట్ ధరించి ఉండగా.. ఆ చేతి నుంచి రక్తం ప్రవాహంలా కారడం కనిపిస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు. కాగా.. హిట్-3 లో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

Next Story