విజయ్ విక్టరీ పై నేచురల్ స్టార్ ఆసక్తికర పోస్ట్.. పవన్ పేరు ప్రస్తావించకుండానే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-04 09:32:04  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని విజయతీరాలకు చేరుస్తున్న నటుడు విజయ్‌కు నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపారు.

విజయ్ విక్టరీ పై నేచురల్ స్టార్ ఆసక్తికర పోస్ట్.. పవన్ పేరు ప్రస్తావించకుండానే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని విజయతీరాలకు చేరుస్తున్న నటుడు విజయ్‌కు నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాని చేసిన ట్వీట్ ఇప్పుడు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సాధించిన గెలుపుతో నాని పరోక్షంగా పోల్చడం విశేషం. "అభినందనలు విజయ్ సార్.. మొదట అనుమానించారు, కానీ ఇప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇది మొదట మా ఇంట్లో (ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ విజయం) జరిగింది. ఇప్పుడు మా పొరుగు ఇంట్లో (తమిళనాడులో విజయ్ విజయం) కూడా జరుగుతోంది. ఒక అండర్ డాగ్ (తక్కువ అంచనా వేయబడిన వ్యక్తి) గెలవడం అనేది ఎప్పుడూ అబ్సల్యూట్ సినిమాలా ఉంటుంది.. లేదా అబ్సల్యూట్ పాలిటిక్స్ అని చెప్పాలేమో!" అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. తమిళనాడు ప్రజలు తమ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని, వారి నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు నాని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, అక్కడ మంచి పరిణామాలు చోటుచేసుకోవాలని ఆయన కోరుకున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ను తక్కువ అంచనా వేసిన వారందరికీ 2024 ఎన్నికల ఫలితాలు ఎలాగైతే షాక్ ఇచ్చాయో, ఇప్పుడు తమిళనాడులో విజయ్ విజయం కూడా అదే రీతిలో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాని తన ట్వీట్ ద్వారా ఇద్దరు స్టార్ హీరోల రాజకీయ ప్రస్థానాన్ని, వారి పట్ల ప్రజలు చూపిన నమ్మకాన్ని చాలా అర్థవంతంగా విశ్లేషించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

Next Story