- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hit-3: చెన్నైలో ప్రమోషన్స్.. క్యూట్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న హీరో, హీరోయిన్
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). ‘హిట్’ ఫ్రాంచైజీస్‌లో రూపొందుతున్న ఈ మూవీ కోసం సినీ ప్రియులతో పాటు నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. అలాగే.. సాంగ్స్‌కు కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇక భారీ అచంనాల మధ్య ‘హిట్-3’ చిత్రం 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో పిచ్చెక్కిస్తున్నారు మూవీ టీమ్. వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలు చోట్ల ప్రమోషన్స్ కంప్లీట్ కాగా.. తాజాగా చిత్ర బృందం ‘హిట్-3’ ప్రమోషన్స్‌ను చెన్నై(Chennai)లో నిర్వహించారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘చెన్నైలో నిర్వహించిన HIT3 ప్రమోషన్‌లో నేచురల్ స్టార్ నాని ధరించిన చొక్కా అభిమానుల నుండి వచ్చిన బహుమతి. దీనిపైన 'లవ్ ఫ్రమ్ తమిళనాడు' - తమిళంలో వ్రాయబడింది.. దేశవ్యాప్తంగా మన ప్రియమైన నాని పట్ల మీకున్న ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ షేర్ చేసిన పోస్ట్‌లో నాని ఇంకా శ్రీనిధి శెట్టి క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






